SEARCH...:


recently watched....:
  • గ్రామము [te]
  • User talk:Val2397 [pam]
  • Riggiuna d\'Italia [scn]
  • ふくい浪漫 い〜ざぁええDay [ja]
  • Strona Głśwna [pl]
  • Lingua etrusca (artìculu \'n calabrisi) [scn]
  • Vasco de Gama [bat-smg]
  • Guam [lij]
  • 太田市立韮川小学校 [ja]
  • Cristóbal Colón [bat-smg]
  • Matematik [sl]

  • jetzt mitverdienen


    Der freche Erotikshop!
    02 Logo 120x60

    Party Explosion - Click here!
    Final Fantasy III DS game

    Miller Brothers, Click here!
    www.easycar.com
    Estate
    Win a Supercar of your dreams........make Summer special this year

    00003 ORION - Logo
    Fancy a hot adventure? More fun for HIM and HER – Shopping at PABO.com!

    LANGUAGE: ar | id | bg | ca | ceb | cs | da | de | et | en / / | es | eo | fr | gr | he | hr it | ko | lt | hu | nl | ja | no | pl | pt | ru | ro | sk | sl | sr | fi | sv | te | tr | uk | zh

    గ్రామం

    వికీపీడియా నుండి

    (గ్రామము నుండి దారిమార్పు చెందింది)
    ఆంధ్రప్రదేశ్‌లోని ఒక గ్రామంలో దృశ్యాలు
    ఇంగ్లాండ్‌లోకాసిల్ కూంబ్ గ్రామంలో ప్రధావ వీధి, విల్‌షైర్ ప్రాంతంలో


    గ్రామం (Village) లేదా పల్లెఅనేది కొన్ని నివాసాల సముదాయం. ఇది నగరం లేదా పట్టణం కంటే చిన్నది. గూడెం (Hamlet) కంటే పెద్దది[1].

    మనిషి సంఘజీవి కనుక ఇతరులతో అవసరాలను అనుసరించి దగ్గరగా జీవించుటకు కొందరు ఒకేచోట లేదా ఒకే ప్రాంతమును కేంద్రముగా చేసుకొని వారి వారి నివాసాలను ఏర్పాటు చేసుకోగా ఏర్పడునది ఒక గ్రామమవును. గ్రామాలు వాటి మద్య వ్యాపార సంబంద కార్యకలాపాలు నెరపేందుకు వాటి కూడలిగా కొన్ని పట్టణాలు ఏర్పడతాయి. ఆయా పట్టాణాలను కేంద్రీకృతం చేసుకొని దగ్గర దగ్గరలో గ్రామాలు అభివృద్ది చెందుతాయి. ఎక్కువ గ్రామాలు శాశ్వతంగా ప్రజలు నివాసం ఉండేవి. కాని కొన్ని గ్రామాలు తాత్కాలికం కావచ్చును. అలాగే ఎక్కువ గ్రామాలలో ఇండ్లు దగ్గర దగ్గరగా ఉంటాయి. కాని కొన్ని గ్రామాలలో ఇండ్లు దూర దూరంగా ఉండవచ్చును[2].


    చారిత్రికంగా వ్యవసాయం గ్రామాల ఏర్పాటుకు పట్టుకొమ్మ కాని కొన్ని గ్రామాలు ఇతర వృత్తులు ఆధారంగా ఏర్పడ్డాయి. రాజకీయ, పరిపాలనా ప్రయోజనాల కారణంగానూ, పారిశ్రామిక విప్లవం అనంతరం పరిశ్రమలు విస్తరించడం వలనా అనేక గ్రామాలు పట్టణాలుగానూ, నగరాలుగానూ వృద్ధి చెందాయి.

    ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది గ్రామాలు ఉన్నందున వీటిలో ఎంతో వైవిధ్యం ఉంది. కనుక గ్రామం అంటే ఇలా ఉంటుంది అని చెప్పడం కష్టం. షుమారుగా 10 నుండి 1000 వరకు కుటుంబాలు ఉండే గ్రామాలు ఎక్కువగా ఉంటాయి. 2001 జనాభా లెక్కల ప్రకారం భారత దేశంలో మొత్తం 6,38,365 గ్రామాలు (నిర్జన గ్రామాలతో కలిపి) ఉన్నాయి[3]. అధికంగా గ్రామాలలో నివాసాలు అక్కడి అవసరాలను బట్టి ఉంటాయి.

    • రక్షణ అవుసరమైన చోట (దొంగల భయం వంటివి ఉన్నట్లయితే) నివాసాలు దగ్గర దగ్గరగా ఉంటాయి.
    • అక్కడి వాతావరణాన్ని బట్టి, అక్కడ దొరికే వస్తువులను బట్టి నివాసాల నిర్మాణం జరుగుతుంది. ఉదాహరణకు కేరళలో వర్షాలను తట్టుకొనే ఇళ్ళు, హిమాచల్ ప్రదేశ్‌లో హిమపాతాన్ని తట్టుకొనేవిధంగా నిర్మించిన ఇళ్ళు కొండలపై దూరదూరంగా ఉంటాయి. రాజస్థాన్ ఎడారిలో ఇళ్ళలో కలప కంటే మట్టి వినియోగం ఎక్కువ.
    • అక్కడి వృత్తులు కూడా ఇళ్ళ నిర్మాణాన్ని, ప్రజల జీవనాన్ని బాగా ప్రభావితం చేస్తాయి.
    • దగ్గరలో ఉండే నగరాల వనరులు, అవసరాలు, వాణిజ్య సంబంధాలు గ్రామ జీవనంపై గణనీయమైన ప్రభావం కలిగి ఉంటాయి. ఉదాహరణకు నగరం దగ్గరలో ఉన్న గ్రామాలలో పాల ఉత్పత్తికి, కూరగాయల పెంపకానికి మంచి ప్రోత్సాహం లభిస్తుంది.

    విషయ సూచిక

    [మార్చు] భారత దేశంలో గ్రామాలు

    మధ్య భారతదేశంలోని గ్రామం.
    దక్షణ భారతదేశంలోని గ్రామం.

    "భారత దేశం ఆత్మ పల్లెలలో ఉన్నది" అని మహాత్మా గాంధీ అన్నాడు[4]. 2001 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 74% జనాభా మొత్తం 6,38,365 గ్రామాలలో నివసిస్తున్నారు[5]. వీటిలో 2,36,004 గ్రామాలలో జనాభా 500 లోపే ఉంది. 3,976 గ్రామాల జనాభా 10,000 పైబడి ఉంది.

    రాష్ట్రం / కేంద్ర పాలిత ప్రాంతం 1991లో గ్రామాలు 2001లో గ్రామాలు
    మొత్తం దేశం 634,321 638,365
    జమ్ము, కాష్మీరు 6,705 6,652
    హిమాచల్ ప్రదేశ్ 19,388 19,831
    పంజాబ్ 12,795 12,729
    చండీగఢ్ 25 24
    ఉత్తరాంచల్ 16,623 16,805
    హర్యానా 6,988 6,955
    ఢిల్లీ 209 165
    రాజస్థాన్ 39,810 41,353
    ఉత్తర ప్రదేశ్ 107,327 107,440
    బీహార్ 45,077 45,113
    సిక్కిం 453 452
    అరుణాచల్ ప్రదేశ్ 3,649 4,065
    నాగాలాండ్ 1,225 1,315
    మణిపూర్ 2,212 2,391
    మిజోరామ్ 785 817
    త్రిపుర 856 870
    మేఘాలయ 5,629 6,023
    అసోం 25,590 26,247
    పశ్చిమ బెంగాల్ 40,889 40,783
    ఝార్ఖండ్ 32,620 32,615
    ఒరిస్సా 51,057 51,352
    ఛత్తీస్‌గఢ్ 20,378 20,308
    మధ్యప్రదేశ్ 55,842 55,392
    గుజరాత్ 18,509 18,544
    డామన్ డయ్యూ 23 26
    దాద్రా నగర్‌హవేలీ 71 70
    మహారాష్ట్ర 43,025 43,722
    మధ్య ప్రదేశ్ 28,000 28,123
    కర్ణాటక 29,193 29,483
    గోవా 369 359
    లక్షద్వీప్ 23 24
    కేరళ 1,384 1,364
    తమిళనాడు 16,780 16,317
    పుదుచ్చేరి 264 92
    అండమాన్ నికోబార్ దీవులు 547 547

    [మార్చు] ఇతర దేశాలలో గ్రామాలు

    ఫిలిప్పీన్స్

    ఫిలిప్పీన్స్ నగర ప్రాంతాలలో "village" అన్న పదాన్ని ప్రైవేటుగా నిర్మించిన గృహ సముదాయానికి అధికంగా వాడుతారు (గేటెడ్ కమ్యూనిటీలు). ఒకప్పుడు బాగా స్థితిమంతులైన వారి గృహాల సముదాయాలుగా ఆవిర్భవించిన ఈ జీవన విధానం ఇప్పుడు మనీలా వంటి నగరాలలో సర్వ సాధారణమైంది.

    తైవాన్

    తైవాన్‌లో నగరాలలో ఉపభాగాలను గ్రామాలు లేదా tsuen (村) అని వ్యవహరిస్తారు (ఇవి గ్రామీణ ప్రాంతాలలో ఉంటే). అదే గ్రామాలు నగరాలలో ఉంటే వాటిని (鄉) li (里 లేదా 鎮) అని అంటారు..

    వియత్నాం

    లాంగ్ ("làng")̲ అనబడే వియత్నాం గ్రామం వారి సమాజంలో మౌలికమైన యూనిట్. ఆసియాలోని పలు గ్రామాలవలె వియత్నాం గ్రామాలు అధికంగా వ్యవసాయాధారితమైనవి. సాధారణంగా ప్రతి వియత్నాం గ్రామానికి ఒక మెయిన్ గేటు (వెదురు గడలతో చేసినది -"lũy tre"), ఒక కమ్యూనిటీ హాలు ("đình làng" ఇక్కడ ఆ వూరి దేవత "thành hoàng" పూజింపబడుతాడు) ఉంటాయి. వూరి వరి పొలం ("đồng lúa"), గుడి ("chùa") కూడా సాధారణం. దాదాపుగా ఒక వూరిలో వారందరూ రక్త సంబంధీకులై ఉండే అవకాశం ఉంది. గ్రామాల సంప్రదాయాలు వియత్నాం సమాజంలో (ప్రభుత్వ చట్టాలకంటే కూడా) బలమైనవి. "రాజుగారి శాసనం పల్లె పద్ధతులకు లొంగి ఉంటుంది" ("Phép vua thua lệ làng") అనేది వారి నానుడి. గ్రామంలో ప్రతి వ్యక్తీ తన మరణానంతరం ఆ గ్రామంలోనే ఖననం చేయబడాలని కోరుకుంటాడు.

    ఐరోపాలో

    స్లావిక్ దేశాలు బోస్నియా-హెర్జ్‌గొవీనియా, బల్గేరియామ క్రొవేటియా, మేసిడోనియా, రష్యా, సెర్బియా, ఉక్రెయిన్ వంటి "స్లావిక్" దేశాలలో సెలో (Selo) అనే స్లావిక్ భాషాపదాన్ని గ్రామంకు వాడుతారు.

    Typical house in a Russian village (derevnya)

    1926-1989 మధ్యకాలంలో రష్యాలో గ్రామీణ జనాభా 76 మిలియన్ల నుండి 39 మిలియన్లకు తగ్గింది. ప్రజలు నగర ప్రాంతాలకు తరలి పోవడం ఇందుకు ముఖ్య కారణం. 1930-37 మధ్య కాలంలో కరువు కారణంగా 14 మిలియన్ పేద గ్రామీణులు మరణించారని అంచనా[6].

    చాలా మటుకు రష్యాలోని గ్రామాలు 200 లేదా అంతకంటే తక్కువ జనాభాను కలిగి ఉంటాయి. ఇలాంటి చిన్న చిన్న గ్రామాల్లోని ప్రజలే వలస వెళ్తుంటారు. ఉదాహరణకు 1959లో దాదాపు 50% గ్రామీణ జనాభా రష్యాలో 500 కంటే తక్కువ జనాభా కలిగిన గ్రామాల్లో నివాసం ఉండేది, ఇప్పుడు ఆ సంఖ్య 1/3 వంతు కంటే తక్కువగా ఉంటుంది. 1960లు మరియు 70లలో అధికారులు వ్యవసాయదారులను అతిచిన్న గ్రామాల నుండి కొంచెం పెద్ద గ్రామాలకు తీసుకునివెళ్ళి ఉపాధి కల్పించేవారు[7].

    ఇతర దేశాలో లాగానే రష్యా గ్రామాలలో నివాసం ఉండేవారు అధికంగా వ్యవసాయం మీద ఆధారపడుతారు. ఎక్కువ మంది తమ ఆహారాన్ని తామే ఉత్పత్తి చేసుకొంటారు. ధనికులైన పట్టణ వాసుల రెండవ విశ్రాంతి గృహాలు ఎక్కువగా ఉన్న కొన్ని గ్రామాలు డచా సెటిల్‌మెంటులుగా ఆవిర్భవిస్తుంటాయి.


    దక్షిణ రష్యాలోను, ఉక్రెయిన్‌లోను అధికంగా ఉన్న కొస్సాక్ జనుల జీవనం అక్కడి సారవంతమైన నేల వలన మిగిలిన ప్రాంతాల జీవనం కంటే భిన్నంగా ఉండేది. మిగిలిన ప్రాంతాలలో బలంగా ఉన్న భూస్వామి అధిపత్యం ఇక్కడ ఉండేది కాదు. కనుక వీరు సెర్ఫ్ విధానానికి లోబడేవారు కాదు. చిన్న చిన్నరైతులు తమ స్వంత పొలం 'ఖుతూర్'లో నివాసం ఉండేవారు. కాకస్ పర్వత శ్రేణుల ప్రాంతాలలోని అధికంగా ముస్లిమ్ జనాభా ఆవాసాలను ఆల్ లేదా ఇదెల్ ఉరల్ అంటారు.

    యునైటెడ్ కింగ్‌డమ్

    ఇంగ్లాండ్‌లో ఎక్కువగా పల్లపు మైదాన ప్రాంతాలలో గ్రామాలు ఉన్నాయి. సాధారణంగా'గూడెం'(hamlet)లో చర్చి ఉండదు. గ్రామం (village)లో చర్చి ఉంటుంది. గ్రామం అని (పట్టణఁ కాదని) చెప్పడానికి ముఖ్యమైన లక్షణాలు - (1) వ్యవసాయ మార్కెట్ ఉండదు (2) టౌన్ హాల్, మేయర్ వంటి వ్యవస్థలు ఉండవు (3) హద్దులలో పచ్చని ప్రాంతాలు (పొలాల వంటివి) ఉంఠాయి (4) దగ్గరలోని పట్టణం లేదా నగరానికి ఈ గ్రామంపై ఏ విధమైన అధికారిక అజమాయిషీ ఉండదు. - అయితే ఈ లక్షణాలు చాలావరకు ఈ మధ్యకాలంలో మారుతున్నాయి.

    ఫ్రాన్స్

    ఫ్రాన్స్‌లోని గ్రామాలు కూడా పైన చెప్పిన ఇంగ్లాండ్ గ్రామాల లక్షణాలు కలిగి ఉంటాయి.

    నెదర్లాండ్స్

    ఆహార పదార్ధాల ఉత్పత్తి అధికంగా ఉన్న జిల్లాలలోని గ్రామాలు అధికంగా కృత్రిమమైన గుట్టలు (terps) పైని నిర్మించబడ్డాయి. (దేశంలో ఇవి పల్లపు ప్రాంతాలు గనుక). తరువాత "డైక్" నిర్మాణాలు వచ్చినాక ఈ విధానం మారింది..


    లెబనాన్

    ఎక్కువ గ్రామాలు పర్వతమయ ప్రాంతాలలో ఉన్నాయి. ఎక్కువ గ్రామాల పేర్లుఅరామిక్ భాష ఆధారంగా ఏర్పడినాయి. 18వ శతాబ్దం వరకు ఈ భాష లెబనాన్ పర్వత ప్రాంతంలో వాడబడేది[8]. ఎక్కువ గ్రామాలు " కదా (kadaa)" అనబడే జిల్లాలలోని ఉప విభాగాలు.


    పసిఫిక్ దీవులు

    పసిఫిక్ దీవులలోని చిన్న చిన్న జనావాసాలను (బయటి నుండి వచ్చిన) ఇంగ్లీషువారు గ్రామం అనేవారు. కొన్ని గ్రామాలు చాలా పెద్దవైనా పేరు మాత్రం అలాగే ఉంది. ఉదాహరణకు గ్వామ్ గ్రామం జనాభా 40,000 పైబడి ఉంది.

    న్యూజిలాండ్

    సంప్రదాయిక మావొరీ గ్రామం ఉదాహరణ పా. కొండపైన రక్షితమైన గ్రామం. నిర్మాణానికి అధికంగా దూలాళు వాడుతారు.

    ఆస్ట్రేలియా

    ఆస్ట్రేలియాలో విలేజెస్ అనబడే చిన్న చిన్న జనావాసాలు అధికంగా ప్లాన్ చేయబడినవి. ఇవి పదవీ విరమణ చేసిన వారికి, వ్యాపారానికి, యాత్రికులకు - ఇలా ప్రత్యేక అవసరాలకు నిర్మించబడ్డాయి.

    అర్జెంటీనా

    ఎక్కువ గ్రామాలు పర్వతాలలో ఉన్నాయి. కొన్ని గ్రామాలు పర్యాటకులను ఆకర్షించడానికి అధికంగా ప్రసిద్ధం. ఉదాహరణ: లా కుంబ్రసిటా, విల్లా ట్రఫుల్, లా కుంబ్రె

    యునైటెడ్ స్టేట్స్


    అమెరికా లోని 20 రాష్ట్రాలలో [9] విలేజ్ (village) అనే పదాన్ని ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయబడిన ఇన్‌కార్పొరేటెడ్ మునిసిపల్ గవర్నమెంట్ పాలనా వ్యవస్థ కలిగిన జనావాసాలను సూచించడానికి వాడుతారు. వివిధ రాష్ట్రాలలో 'గ్రామం' అన్న పదం జనసంఖ్య కంటే అక్కడి పాలనా వ్యవస్థను బట్టి వర్తించబడుతుంది. న్యూయార్క్ వంటి నగరాలలో ఒక గ్రామాంలోని ప్రజలు గ్రామానికి, నగరానికి కూడా చెందుతారు. అక్కడ నివసించేవారు గ్రామానికీ, నగరానికీ కూడా పన్నులు చెల్లిస్తారు. రెండింటి ఎన్నికలలోనూ వోటు వేస్తారు.

    [మార్చు] ఇవి కూడా చూడండి

    [మార్చు] మూలాలు

    1. http://www.answers.com/village&r=67
    2. http://www.google.co.uk/search?hl=en&safe=off&q=%22transient+villages%22&btnG=Search&meta=
    3. భారతీయ జన గణన వారి సమాచారం
    4. http://www.pibbng.kar.nic.in/feature1.pdf
    5. http://www.censusindia.net/results/2001census_data_index.html
    6. Robert Conquest (1986) The Harvest of Sorrow: Soviet Collectivization and the Terror-Famine. Oxford University Press. ISBN 0-19-505180-7.
    7. "Российское село в демографическом измерении" (Rural Russia measured demographically) మూస:Ru icon. ఈ క్రింది పట్టిక రష్యా జనాభా లెక్కలను సూచిస్తుంది:
      Census year 1959 1970 1979 1989 2002
      Total number of rural localities in Russia 294,059 216,845 177,047 152,922 155,289
      Of them, with population 1 to 10 persons 41,493 25,895 23,855 30,170 47,089
      Of them, with population 11 to 200 persons 186,437 132,515 105,112 80,663 68,807
    8. http://almashriq.hiof.no/lebanon/400/410/412/elies_project/glimse_of_yesterday.html
    9. http://www.websters-online-dictionary.org/definition/english/vi/village.html#Definitions

    [మార్చు] బయటి లింకులు

    "http://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%82" నుండి వెలికితీశారు
    Change language: All | الرربية | Bahasa Indonesia | Български | Català | Cebuano | Ħesky | Dansk | Deutsch | Eesti | English | Español | Esperanto | Français | עברית | Hrvatski | Italiano | 핶국어 | Lietuvių | Magyar | Nederlands | 旡涬語 | Norsk (bokmál) | Polski | Português | Русскиб | Română | Slovenčina | Slovenščina | Српски / Srpski | Suomi | Svenska | తెలుగు | Türkçe | УкраїнсѦка | 中文

    Autorem skryptu AdWiki v0.8 (2007) jest husky83
    Wikipedia jest zarejestrowanym znakiem towarowym Wikimedia Foundation
    Wszystkie materiały pochodzą z Wikipedii, obięte są licencją GNU Free Documentation License