శాయపురం
వికీపీడియా నుండి
శాయపురం (Sayapuram), కృష్ణా జిల్లా, ఉయ్యూరు మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామ జనాభా 3000 నుండి 4000 వరకు ఉంటుంది.
విషయ సూచిక |
[మార్చు] గ్రామ చరిత్ర
ఈ గ్రామమునకు ఈ నామము షాహిపురం నుండి వచ్చినది. ఈ ఊరి పెద్దల, వృద్దుల కధనం ప్రకారము 16 శతాబ్దమునందు ఈ గ్రామము ఏర్పడినది అని, ఆ రొజులలొ ఈ ప్రాంతము పరిపాలించుచున్న నవాబు హిందూ దివాను ఇచ్చటికి వచ్చి చెరువు వద్ద విశ్రాంతి తీసుకున్నాడు అని. ఆ చెరువునీటి రుచి ఇష్టపడి. అక్కడ ఒక శివాలయము, ఒక విష్ణు ఆలయం కట్టదల్చుకొని అక్కడ మసీదు కడుతున్నట్లు చెప్పి నిధులు తీసుకొని ఆలయములు కట్టించినాడు అని (ఈ కధనముననుసరించి ఇక్కడ విష్ణాలయము, శివాలయములు కలవు).[ఆధారం కోరబడినది] అక్కడికి కొంత దూరంలో మసీదు కూడా కట్టించి తరువాత ఈ ప్రాంతమునకు షాహిపురమని పేరు పెట్టినట్లుగా చెపుతారు. కాలక్రమంలో షాహిపురం శాయపురంగా మారినదిగా అంటారు.
[మార్చు] దేవాలయములు
- పురాతనమైన విష్ణుదేవాలయం కలదు.
- శిధిలమైన దేవాలయము స్థానమున పునరుద్ధరించబడిన శివాలయము కలదు.
[మార్చు] వ్యవసాయ విషయాలు
ఈ గ్రామము నందు ముఖ్యమయిన పంటలు వరి మరియు చెరకు.
[మార్చు] విద్యా సౌకర్యాలు
ఈ గ్రామములో ఒక పాఠశాల ఉన్నది. ఈ పాఠశాలలొ రేడియో పాఠాలు విని నేర్చుకొనే సదుపాయం కలుగజేశారు.
[మార్చు] రవాణా సదుపాయములు
ఈ గ్రామమునకు ఇప్పటికి కూడ సరయిన ప్రయాణ సదుపాయములు లేవు. విజయవాడ నుండి బస్సులొ నాగాయలంక, అవనిగడ్డ మార్గములో బస్సు ఎక్కి, గోపువానిపాలెం స్టాపులొ దిగాలి. అక్కడినుంచి ఆటోలొ శాయపురంకు వెళ్ళవచ్చు.
[మార్చు] గ్రామానికి సంబంధించిన మరికొన్ని చిత్రాల మాలిక
- గ్రామం స్వరూపం
- జన జీవనం
|
|
|
|---|---|
| అకునూరు · కడవకొల్లు · కలవపాముల · కాటూరు · గండిగుంట · చిన ఓగిరాల · జబర్లపూడి · పెద ఓగిరాల · బొల్లపాడు · ముదునూరు · రామచంద్రాపురం · శాయపురం · ఉయ్యూరు |










































